||ప్రతీకాత్మక చిత్రం ||
ఈవార్తలు, కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. జిల్లాలోని పెద్దాపురం మండలం జీ రాగంపేటలో ఉన్న అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు అందులోకి దిగారు. అయితే, అందులో ఊపిరాడక ఒకరి తర్వాత మరొకరు అలా మొత్తం మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులు అని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరిది పెద్దాపురం మండలం పులిమేరు అని వెల్లడించారు. మృతులు కుర్రా రామారావు(45), వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబు, కట్టమూరి జగదీశ్, ప్రసాద్‌గా గుర్తించారు. పోలీసులు పరిశ్రమ వద్ద పరిస్థితులను పరిశీలించి, కేసు నమోదు చేశారు.