Attack on Parliament | పార్లమెంట్‌పై దాడి.. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత మళ్లీ..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

న్యూఢిల్లీ, డిసెంబర్ 13:  దేశ చరిత్రలో మరో సారి పార్లమెంట్‌పై దాడి.. సరిగ్గా 22 ఏళ్ల తర్వాత, అదే రోజు భారత పార్లమెంట్‌పై దాడి జరిగింది. అవును! బుధవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో లోక్‌సభలోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంపీలు ఉన్నచోటువైపు దూకారు. తమతో వెంట తెచ్చుకున్న గ్యాస్‌ను వదిలారు. నిరంకుశత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు. అటూ ఇటూ దూకుతూ బీభత్సం సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో చాలా మంది ఎంపీలు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఎంపీలు దుండగులను పట్టుకొని చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. దుండగులను సాగర్‌శర్మ, మనోరంజన్‌గా గుర్తించారు. పార్లమెంటు బయట కూడా ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. ఈ నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి పారంభమైన తర్వాత సభలో స్పీకర్ ఓంబిర్లా ఈ ఘటనపై ప్రకటన విడుదల చేస్తూ.. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించి పార్లమెంటు భద్రతపై పార్టీల అభిప్రాయం తీసుకున్నారు. భదత పటిష్ఠం చేయాలని కేంద్ర హోంశాఖకు సిఫార్సు చేశారు. 

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు..

2001 డిసెంబర్ 13న పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తాయిబా ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు 22 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి పార్లమెంటుపై దాడి చేస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ సంస్థ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్ పన్నున్ హెచ్చరించాడు. డిసెంబర్ 13 లోపే దాడి చేస్తామని సవాల్ చేశాడు. అన్నట్లుగానే బుధవారం దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను బాధ్యుడిని చేస్తూ విపక్షాలు భగ్గుమన్నాయి. వెంటనే షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

వెబ్ స్టోరీస్