జగిత్యాల పట్టణంలో భారీ దొంగతనం.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది. పట్టణంలోని గోవిందుపల్లెలో ఓ ఇంట్లో దుండగులు దొంగతనం చేసి.. బీరువాలో ఉన్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

jagtial theft

ప్రతీకాత్మక చిత్రం

జగిత్యాల, ఈవార్తలు : తెలంగాణలోని జగిత్యాల జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది. పట్టణంలోని గోవిందుపల్లెలో ఓ ఇంట్లో దుండగులు దొంగతనం చేసి.. బీరువాలో ఉన్న రూ.4 లక్షల నగదు, 15 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, డీవీఆర్‌లను కూడా ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

వరుస చోరీల నేపథ్యంలో ప్రజలకు పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. దొంగలు పలు గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తూ రాత్రి పూట దొంగతనానికి పాల్పడుతున్నారని వెల్లడించారు. ఎవరైనా వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే ఇంటిపక్కన లేదా దగ్గరివాళ్లకు తెలియజెప్పాలని తెలిపారు. విలువైన వస్తువులు వేరే చోట గానీ, బ్యాంకర్లలో గానీ దాచుకోవాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్