Seven Died in Accident in Godavari:ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‎లోనే ఏడుగురు మృతి

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

road accident

ప్రతీకాత్మక చిత్రం 

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు వెళ్ల్తున్న మినీ లారీ ఆరిపాటిదిబ్బలు, చిన్నాయిపాలెం రహదారిలని చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. వాహనంపై 9మంది కార్మికులు ఉన్నారు. 

లారీ తిరగబడటంతో జీడిపిక్కల బస్తాలు కార్మికులపై పడి ఏడుగురు మరణించారు. మరణించినవారంతా తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య, తమ్మిరెడ్డి సత్యనారాయణ, చినముసలయ్య, కృష్ణ , కత్తవ సత్తిపండు, తాడి కృష్ణ, నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. కొవ్వూరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. డెడ్ బాడీలు ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. కాగా డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్