తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. రైలు ఢీకొని ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు.
ప్రతీకాత్మక చిత్రం
మేడ్చల్, ఈవార్తలు : తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. రైలు ఢీకొని ఓ తండ్రి, ఇద్దరు కూతుళ్లు దుర్మరణం చెందారు. మృతుడు రైల్వే లైన్‌మెన్ కృష్ణగా పోలీసులు గుర్తించారు. ఏం జరిగిందంటే.. రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ.. అతడి ఇద్దరి కూతుళ్లతో కలిసి ట్రాక్‌పై పనిచేస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో కృష్ణతో పాటు అతడి ఇద్దరు కూతుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు రాఘవేంద్రనగర్‌కు చెందినవారు అని తెలిసింది. ఘటనపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ట్రాక్‌పై పనిచేస్తుండగా, రైలు ఎలా నడిపించారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. లేక.. రైలు వస్తుందన్న సమాచారం మృతుడికి ముందే తెలీదా? పై అధికారులు సమాచారం అందించలేదా? అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.