Allu Arjun Arrest | అల్లు అర్జున్ అరెస్టు.. నేరం రుజువైతే పదేళ్ల జైలు శిక్ష

సినీ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా చూసేందుకు వచ్చి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన కేసులో ఆయనను ఈ రోజు అరెస్టు చేశారు.

allu arjun

అల్లు అర్జున్ అరెస్టు

హైదరాబాద్, ఈవార్తలు: సినీ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితమే అరెస్టు చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా చూసేందుకు వచ్చి సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన కేసులో ఆయనను ఈ రోజు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్‌ సహా.. సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు పంపించారు. ఘటనపై చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సంధ్య థియేటర్ మొత్తం ఏడుగురు యజమానుల్లో సందీప్ ఒకరు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్, లోయర్ బాల్కని చూసుకునే మేనేజర్ విజయ్ చందర్‌ని కోర్టులో హాజరు పరిచాం. వారిని జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించాం. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బాబు పరిస్థితి బాగానే ఉంది. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగింది’ అని వివరించారు. 

కాగా, ఈ ఘటనలో రేవంతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్‌పై 105, 118 (1), రెడ్ విత్ 3/5 బీఎన్ఎస్ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే అల్లు అర్జున్‌కు సుమారు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్