Selfie Problems | ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు.. 100 ఫీట్ల లోయలో పడ్డ మహిళ

సతారా జిల్లా బోర్నే ఘాట్‌లో ఓ మహిళ (29) తన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ 100 అడుగుల లోయలో పడిపోయింది.

pune selfie

మహిళను కాపాడుతున్న సిబ్బంది

ముంబై, ఈవార్తలు: సెల్ఫీ మోజు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను హరించింది. కొందరు వింత పోకడలకు పోయి, ప్రాణాలకు తెగించి.. సెల్ఫీ తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. సతారా జిల్లా బోర్నే ఘాట్‌లో ఓ మహిళ (29) తన స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ 100 అడుగుల లోయలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, హోంగార్డులు ఆమెను తాడు సాయంతో రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆమె లోయ వద్ద కాలకృత్యాలు తీర్చుకొనేందుకు వెళ్లి, కాలు జారి లోయలోకి పడిపోయిందని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజుల క్రితమే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (26) రాయ్‌గఢ్‌లోని కుంబే జలపాతం వద్ద వీడియో తీస్తూ పడిపోయి మరణించిన సంగతి తెలిసిందే.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్