వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో బూంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి.. 153/2024 క్రైం నెంబర్ కేసు బుక్ చేశారు.
రిమాండ్ రిపోర్టు
వికారాబాద్, ఈవార్తలు : వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో బూంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి.. 153/2024 క్రైం నెంబర్ కేసు బుక్ చేశారు. సెక్షన్ 61(2) 191(4),132,109,121(1) 126(2)324 r/w190BNS Sec 30Of pdpp act, 128Of bnss కింద హత్యాయత్నం, అసాల్టింగ్, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు నమోదు చేశారు. మొత్తం 46మందిని నిందితులుగా చేర్చి.. A1 గా బోగమోని సురేష్‌ను ప్రధాన నిందితుడుగా పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు16 మందిని అరెస్ట్ చేయగా, 30 మంది పరారీలో ఉన్నట్లు నమోదు చేశారు.
రిమాండ్ రిపోర్టులో ఇంకా.. ‘పక్కా ప్లాన్ ప్రకారమే నిందితులు దాడిచేశారు. రాళ్లు, కర్రలు, కారంపొడి ముందే సిద్ధం చేసుకున్నారు. అధికారులు వచ్చిన వెంటనే దాడి చేయాలని ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశాడు A1 నిందితుడు సురేష్. ప్రధాన నిందితుడు సురేష్ పాటు 29 మంది పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేశారు. లగచర్ల గ్రామానికి కావాలనే కలెక్టర్‌ను సురేశ్ తీసుకెళ్లాడు. కేసులో అతడే కీలకం’ అని పేర్కొన్నారు. కాగా, అరెస్ట్ అయిన నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు.