శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. ట్రాక్టర్ ఢీకొని నవ దంపతులు దుర్మరణం

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ ఢీకొని నవ వధూవరులు మృతి చెందారు. పెళ్లయిన రెండు రోజులకే ఇలా జరగడం గ్రామంలో అందరిని కంటతడి పెట్టిస్తోంది. ఇచ్ఛాపురంలోని బెల్లుపడ కాలనీకి చెందిన 21 ఏళ్ల వేణు(సింహాచలం), బెర్హంపూర్‌కు చెందిన 18 ఏళ్ల సుభద్ర (ప్రవల్లిక)తో. ఈ నెల 10 న వివాహం జరిగింది.  ఇచ్చాపురం నుండి ఒడిస్సా రాష్ట్రంలోని బెర్హంపూర్‌ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న నవవధూవరులకు ట్రాక్టర్ ఢీకొని సుభద్ర అక్కడికక్కడే మృతి చెందింది. వేణు ని ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రికి వెళ్లే లోపే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈనెల 12న అమ్మాయి తల్లిదండ్రులు విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరవ్వడానికి పయనమై మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. గొల్లంత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ బలంగా ఢీకొని మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. వేణు తండ్రి రామారావు గత కొంత కాలం కిందనే మరణించగా, తమను వదిలి పెట్టి వెళ్లవూ అంటూ.. అక్క, అన్న, అమ్మ బోరున విలపిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్