గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతిచెందారు.
ఏలూరు, ఈవార్తలు : గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతిచెందారు. ఆయన మృతదేహాన్ని మంగళవారం ఉదయం ఏలూరు కాల్వలో తూటికాడ మధ్య ఇరుక్కొని ఉన్న మృతదేహాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. కాగా, ఇంతకుముందే ఆయన సిగ్నల్ ఆధారంగా ఏలూరు కాల్వలో దూకాడని భావించిన పోలీసులు.. విజయవాడ నుంచి ఏలూరు వరకు విస్తృతంగా గాలించారు. ఈ నెల 15న సెలవు పెట్టి అదృశ్యమైన వెంకట రమణ.. నా పుట్టిన రోజే నా చావు రోజు అని తన కుమారుడికి మెసేజ్ చేసి కనిపించకుండాపోయారు.
ఇప్పటికే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సూసైడ్ నోట్ రాసి.. వైసీపీ హయాంలో మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. నరసాపురంలో ఫెర్రీ లీజు అంశంలో ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్ రెడ్డప్ప ధవేజీ బెదిరింపులు తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. తనకు న్యాయం చేయాలని అందులో కోరారు. ఈ నేపథ్యంలో వెంకటరమణ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.