Flash News : అల్లు అర్జున్‌ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు కీలక తీర్పు

సినీనటుడు అల్లు అర్జున్‌ Allu Arjun రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు Nampally Court కీలక తీర్పు వెలువరించింది.

allu arjun

అల్లు అర్జున్

హైదరాబాద్, ఈవార్తలు : సినీనటుడు అల్లు అర్జున్‌ Allu Arjun రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు Nampally Court కీలక తీర్పు వెలువరించింది. అల్లు అర్జున్‌కు ఊరట కలిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఇరువైపుల వాదనలు ముగియగా, బెయిల్‌పై కోర్టు నిర్ణయం తీసుకుంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం, ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన అనంతరం నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడం.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం.. లాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా, నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో అల్లు అర్జున్ వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్‌పై కోర్టు నేడు నిర్ణయం తీసుకుంది.
సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్