నా కూతురిది హత్యే.. మీడియాతో మెడికో ప్రీతి తండ్రి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రీతి ఫైల్ ఫొటో Photo: Twitter||


వరంగల్ మెడికో విద్యార్థి ప్రీతి మృతి కేసులో కొత్త విషయాలు తెలుగులోకి వస్తున్నాయి. ప్రీతి తండ్రి నరేంద్ర నాయక్ ప్రీతిది ఆత్మహత్య కాదని హత్యేనని సోమవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. తెలంగాణ డీజీపీ ఆఫీసులో డీజీపీ అంజనీ కుమార్‌తో మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రీతి  టాక్సికాలజీ రిపోర్టు మాకు ఇంకా ఇవ్వలేదు.. దీనివెనుక కారణాలు ఉన్నాయి.. నిందితులకు శిక్ష పడకుండా ఉండేందుకు కేసును మళ్లిస్తున్నారు అని అన్నారు. బ్లడ్‌ ఎక్కించిన తర్వాత శాంపుల్స్‌ను టాక్సికాలజీ కోసం పంపించారు. అప్పటికే డయాలసిస్‌ కూడా పూర్తి అయ్యింది. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిందే అంటూ.. ఈ కేసు పైన పూర్తి ఆధారాలు కావాలని డీజీపీతో ప్రీతి తండ్రి చర్చించారు. సూసైడ్ కేసును అనుమాదాస్పద మృతి కేసుగా నమోదు చేయాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని దీనిపైన పూర్తి విచారణ జరపాలని ప్రీతి కుటుంబ సభ్యులు, వివక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే.. ఈ కేసులో పోలీస్ విచారణ, యాంటీ ర్యాగింగ్ కమిటీ జూనియర్ డాక్టర్ విచారణలో పీఏసీ రిపోర్ట్ విషయంలో సైఫ్ ప్రీతిని బ్లెమ్ చేసి, ప్రీతిని వేధించాడని,  పీఏసీ రిపోర్ట్ వివాదంలో తనకు సపోర్ట్ చేయాలని మానసిక ఘర్షణకులోనైన డాక్టర్ ప్రీతి సహా డాక్టర్ తో ప్రీతి లాస్ట్ కాల్ లో తన ఆవేదనను చెప్పుకుందని విచారణలో తేలింది. ఈ వాంగ్మూలాన్ని రికార్డు చేసి కీలక ఆధారాల కోసం మొబైల్ డేటా, సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో విచారణ చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్