valantines day | వాలంటైన్స్ డే గిఫ్ట్ అని చెప్పి.. వివాహిత నుంచి లక్షలు కొట్టేశారు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

వాలెంటెన్స్ డే వచ్చిందంటే చాలు గిఫ్ట్ లతో సర్ప్రైజ్ చేస్తారని ఊహాగానాలు మొదలవుతాయి. అయితే ముంబై కి చెందిన వివాహితకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ ఆ వివాహితకు 3.68 లక్షలు కోల్పోయేలా చేసింది. ముంబై కి చెందిన 51 ఏళ్ల వివాహితకు సోషల్ మీడియాలో పరిచయం అయిన అలెక్స్ లోరెంజో అనే వ్యక్తి తనకు గిఫ్ట్ పంపిస్తున్నానని చెప్పి మోసం చేశాడని, తాను రూ.3.68 లక్షలు పోగొట్టుకున్నానని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అలెక్స్ లోరెంజో పరిచయమయ్యాడు. ఆ వ్యక్తి వాలెంటెన్స్ డే కోసం బహుమతి పంపిస్తున్నానని దీనికోసం యురోలు 750 చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. ఆ తర్వాత కొరియర్ కంపెనీ నుండి సమాచారం వచ్చింది. ఇది పరిమితి కంటే అదనంగా ఉన్నందున 72 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పగా, ఆమె చెల్లించింది. పార్శల్ లో యూరోపియన్ కరెన్సీ ఉండటం వలన మనీలాండరింగ్ కు పాల్పడకుండా ఉండేందుకు 2.65 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆమె ఈ మొత్తాన్ని చెల్లించింది. కాగా ఈ పార్శల్ అందుకునేందుకు ఇంకా 98 వేలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆమెకు తెలిపారు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి  నిలదీయడంతో మొత్తం చెల్లించకపోతే తమ చిత్రాలను కుటుంబ సభ్యులకు  పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఖార్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆదివారం గుర్తుతెలియని ఇద్దరి వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్