సిద్దిపేట జిల్లాలో తల్లి కొడుకుల మరణం కంటతడి పెట్టిస్తోంది. తల్లి చనిపోయిందన్న మరణ వార్త విని కొడుకు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతడు ఆత్మహత్యకు పాల్పడే ముందు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టించింది. సిద్ధిపేట జిల్లాలోని చిన్న కోడూరు గ్రామానికి చెందిన నిమ్మల రాజు, సునీత (40) ఇద్దరూ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు (విఘ్నేశ్ (21), వివేక్) వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉంటున్నా ఈ కుటుంబంలో ఒకసారిగా అలజడి మొదలయ్యింది. ఇంట్లో రాజు, సునీత ల మధ్య ఓ గొడవ వల్ల ఇంతటి దారుణం చోటు చేసుకుంది. రాజు , సునీత ఒడిబియ్యం కోసం డిసెంబర్ 5 న గొడవ పడ్డారు. ఈ విషయంలో సునీత మనస్తాపానికి గురయ్యి పురుగు మందు తాగింది. ఈ విషయం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. కానీ చికిత్స పొందుతూ డిసెంబర్ 8 న కన్నుమూసింది.
తల్లి మరణాన్ని పెద్ద కొడుకు(విఘ్నేశ్) జీర్ణించుకోలేకపోయాడు. తల్లి అంతక్రియలు ముగిసిన వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పకుండా సిద్దిపేట దగ్గరలో ఉన్న నర్సాపూర్ ఎల్లమ్మ గుడి దగ్గర వెళ్లి కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి అమ్మ చనిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాన్న ఆర్థిక స్థితులను చూసి కృంగిపోతున్నాను. నేను అమ్మ దగ్గరకు వెళ్తానంటూ వాళ్ళు చూస్తుండగానే పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని తండ్రి రాజు బంధువులు చిన్నకోడూర్ ఎస్సై శివానందంకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సిద్దిపేట టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ప్రదేశానికి పోలీసులు వెళ్లి విఘ్నేశ్ ను సిద్దిపేటలోని సర్వజన హాస్పిటల్లో చేర్చారు. విఘ్నేశ్ చికిత్స పొందుతూ జనవరి 9న మరణించాడు. అయితే విఘ్నేశ్ మరణించే ముందు తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాలో పెట్టిన స్టేటసు అందరి గుండెల్లో బాధను నింపింది. ‘స్వర్గంలో ఉన్న అమ్మా.. నేను నీ వద్దకు రావాలని కోరుకుంటున్నా. నిన్ను చేరేందుకు సిద్ధంగా ఉన్నా. రెండు చేతులు చాచి నన్ను నీ ఒడిలోకి తీసుకో..’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్టు చూసిన వారందరూ కన్నీరు మున్నీరవుతున్నారు.