టర్కీ సిరియాల్లో మృత్యు విలయం.. భూకంపంతో 1700 మంది సజీవ సమాధి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



|| టర్కీ, సిరియాల్లో మృత్యు విలయం Photo: Twitter ||


టర్కీ, సిరియాలో అతిపెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో దాదాపు 1700 మందికిపైగా మృతి చెందారు. భూకంపం వలన రోడ్డుపై కూలిపోయిన భవనాలు శిధిలాలె కనిపిస్తున్నాయి.  దాదాపు టర్కీలో 2,818 భవనాలు భూకంపం వలన నేలమట్టమయ్యాయి. వేలాదిమంది ఇళ్లను కోల్పోయి నిరాశకు గురయ్యారు. మొదటిసారి భూకంప తీవ్రత  స్కేలుపై 7.8గా రికార్డ్ అవ్వగా, రెండోసారి భారీ ఎత్తున భూకంపం రావడంతో భూకంప తీవ్రత 40 ప్రకంపనాలుగా నమోదైంది. రెండోసారి భూకంపం రావడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. ఇక టర్కీలోని కొన్ని ప్రాంతాలలో మూడోసారి భూమి కంపిస్తున్నట్లు సమాచారం. భూకంపం సంభవించిన ప్రాంతాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పెద్ద పెద్ద భవనాలు కూలి మంచుతో కప్పి ఉండడం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలిగిస్తోంది. భూకంపం వలన నేలమట్టమైన భవనాల మధ్య చిక్కుకుపోయిన మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు. ప్రమాదంలో 2000కు పైగా గాయపడిన వారి సంఖ్య నమోదు అవుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలియజేస్తూ టర్కీ కి కావాల్సిన అన్ని విధాల సహాయాన్ని అందజేస్తామని, టర్కీలో అతిపెద్ద భూకంపం వలన ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగటం ఎంతో బాధాకరంగా ఉందంటూ మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు. గాయాలకు గురైన వారు త్వరలో కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్