సెక్రటేరియట్ ఉద్యోగి అనుమానాస్పద మృతి.. మెదక్ జిల్లాలో ఘటన

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం|| కారు దగ్ధమై ఒకరు సజీవ దహనమైన సంఘటన మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపూర్లో చోటు చేసుకుంది. సోమవారం ఉదయం ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వెంకటాపూర్ శివారులో కారు దగ్ధమవగా ఓ వ్యక్తి మృతదేహం ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి పోలీసులు క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ చేశారు. ఘటనలో మృతిచెందిన వ్యక్తిని టేక్మాల్ మండల పరిధిలోని భీమ్లాతండాకు ధర్మనాయక్ (45)గా గుర్తించారు. ఆయన సెక్రెటేరియట్‌లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ఆదివారం భీమ్లా తండాకు వచ్చిన ఆయన చెరువు కట్ట కిందకు కారు వెళ్లి సజీవ దహనం అయ్యారు. జాగిలం సంఘటన జరిగిన ప్రదేశం నుంచి మృతుని ఇంటికే వెళ్లి ఆగిపోయింది. సంఘటన స్థలంలో మృతునికి సంబంధించిన బ్యాగు, పెట్రోల్ బాటిల్ ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సజీవ దహనమైన విషయాన్ని తెలుసుకున్న మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అక్కడకు చేరుకున్నారు. క్లూస్ టీం సేకరించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు టేక్మాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తున సంభవించిన ప్రమాదంలో సజీవ దహనం అయ్యాడా? లేక ఏదైనా గొడవల కారణంగా, లేక మరేదైన విషయాల వల్ల ఎవరైనా హత్య చేసి శవాన్ని దహనం చేశార అనే విషయాలు కేసు విచారణలో తెలియాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్