AP NEWS: ఏపిలో మృత్యుఘోశ..అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు..17 మంది దుర్మరణం

ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫార్మా సెజ్ లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్నఈ కంపెనీ ప్రధాన కార్యాలయంలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 40 మందికిపైగా గాయపడ్డారు.

AP

ప్రతీకాత్మక చిత్రం 

శిథిలాల కింద ఎందరున్నారో తెలియదు. శరీర భాగాలు ఎవరివో తెలియనలేనంత విషాదం నెలకొంది. పరిశ్రమలో జరిగిన ప్రమాదాల్లో హెచ్ పీసీఎల్ తర్వాత ఆ స్థాయిలో కార్మికులు, సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించినట్లు చెబుతున్నారు. ఈ భారీ అగ్నిప్రమాదం అంతులేని విషాదాన్నినింపింది. ఎసైన్సియాలని మూడో ఫ్లోర్లో 500కిలోల సామర్థ్యం గల రియాక్టర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం ధాటికి పరిసర ప్రాంతాలు భీతావహ పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఫ్యాక్టరీలో రెండు షిఫ్టులలో 381 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా..ఇంకా 9 మంది ఆచూకీ లభించడం లేదు. 

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్