Nellore School Bus Accident : ఏపీలోని నెల్లూరు జిల్లా మునునూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డ ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సు క్లీనర్ మృతి చెందాడు.
ప్రతీకాత్మక చిత్రం
Nellore School Bus Accident : నెల్లూరు, ఈవార్తలు : ఏపీలోని నెల్లూరు జిల్లా మునునూరు టోల్ ప్లాజా వద్ద రోడ్డ ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్సు క్లీనర్ మృతి చెందాడు. మరో ఏడుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆ స్కూల్ బస్సు ఆర్ఎస్ఆర్ స్కూల్‌కు చెందినదిగా తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అనంతరం దవాఖానలో క్షతగాత్రులను పరిశీలించారు. ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. క్లీనర్ చనిపోవటం బాధాకరమని, బాధిత విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని దవాఖాన వర్గాలను ఆదేశించామని తెలిపారు. బస్సుల ఫిట్‌నెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.