అమృత్ స్కీంలో స్కాం జరిగిందని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన శాస్త్రి భవన్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి అమృత్ స్కీంలో స్కాం జరిగిందని వివరాలు అందజేశారు.
కేటీఆర్
న్యూఢిల్లీ, ఈవార్తలు : అమృత్ స్కీంలో స్కాం జరిగిందని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన శాస్త్రి భవన్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి అమృత్ స్కీంలో స్కాం జరిగిందని వివరాలు అందజేశారు. అమృత్ పథకం టెండర్లలో రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి లాభం చేకూర్చేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికే లేఖ ద్వారా ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లిన కేటీఆర్.. తాజాగా నేరుగా కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. అటు.. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు కూడా అమృత్ 2.0 స్కాంపై ఫిర్యాదు అందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు మంగళవారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ముందుకు రానున్నట్లు తెలిసింది. రూ.8,888 కోట్ల విలువైన టెండర్లను అక్రమంగా సృజన్ రెడ్డికి కట్టబెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. స్కాంపై, రేవంత్ రెడ్డి కుటుంబ వ్యవహారాలపై నిజానిజాలు వెలికితీయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.