కోల్ కతాలోని ఆర్జి కార్ మెడికల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అహత్యాచార ఘటనకు సంబంధించి విచారణ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను జాప్యం చేస్తోందని ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకు విచారణను అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణను సిబిఐ సాగిస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేసు విచారణలో జోరు పెరిగింది. ఈ క్రమంలోనే విచారణ సాగిస్తున్న సిబిఐ అధికారులకు కీలక ఆధారం లభించింది.
ఆర్జి కార్ మెడికల్ ఆసుపత్రి
కోల్ కతాలోని ఆర్జి కార్ మెడికల్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అహత్యాచార ఘటనకు సంబంధించి విచారణ జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణను జాప్యం చేస్తోందని ఉద్దేశంతో హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐకు విచారణను అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణను సిబిఐ సాగిస్తోంది. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఈ నేపథ్యంలో కేసు విచారణలో జోరు పెరిగింది. ఈ క్రమంలోనే విచారణ సాగిస్తున్న సిబిఐ అధికారులకు కీలక ఆధారం లభించింది. అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి డైరీ రాసుకునే అలవాటు ఉంది. అత్యాచారం అనంతరం కూడా ఆమె డైరీలో కీలక విషయాలను రాసినట్లు చెబుతున్నారు. అయితే, డైరీలోని ఓ పేజీ చిరిగి ఉందని హతురాలి తండ్రి మీడియాకు వెల్లడించారు. ఆ చిరిగిన పేజీ తాలూకా ఫోటో తన వద్ద ఉందని చెప్పిన ఆయన అందులో ఏం రాసి ఉందనే విషయాన్ని మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. సిబిఐ అధికారులు సూచన మేరకే తాను బహిరంగపరచడం లేదని చెప్పారు. హత్యాచార ఘటనపై ప్రజల ఆందోళనలను అణచివేంచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఫలితంగా తమకు సీఎం మమతపై నమ్మకం పోయిందని హతురాలి తండ్రి వ్యాఖ్యానించారు. న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న మమత తానే న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేయడంలో ఔచిత్యం ఏమిటి అని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం ఆమె ఏమీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, హతురాలికి తల, పెదవులు, చెంపలు, ముక్కు, కుడి దవడ, గదమ, ఎడమ భుజం మోకాలు, చీలమండతోపాటు అంతర్గత అవయవాల్లో గాయాలైనట్లు, ఊపిరితిత్తుల్లో రక్తస్రావమైనట్లు, శరీరంలో కొన్నిచోట్ల బ్లడ్ క్లాట్స్ ను కనుగొన్నట్లు పోస్టుమార్టం రిపోర్ట్ తేల్చింది. మొత్తంగా హతురాలి శరీరంపై 16 చోట్ల, అంతర్గతంగా 9చోట్ల తీవ్ర గాయాలయ్యాయని, అన్ని గాయాలు కూడా ఆమె మరణానికి ముందే సంభవించినవేనని, గొంతు నులమడంతో ఆమె మృతి చెందినట్లు నివేదిక తేల్చింది. మరోవైపు అత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్ కు సిబిఐ మంగళవారం లై డిటెక్టర్ టెస్ట్ (పాలిగ్రాఫ్) నిర్వహించే అవకాశం ఉంది. హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జి కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోస్ ను సిబిఐ అధికారులు వరుసగా నాలుగో రోజు విచారించారు. ఘటనకు ముందు, తరువాత ఆయన ఎవరెవరికి ఫోన్ చేశారు అనేది తెలుసుకున్నారు. వాట్సాప్ లో చాట్ లిస్టును పరిశీలించారు. జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్ కతా, ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలలో వైద్య విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా కోల్ కతాలో సోమవారం ఎక్కడికక్కడ వైద్యులు మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధనం చేశారు. ఇదిలా ఉంటే వైద్య విద్యార్థిని డైరీలో మృతి చెందడానికి కొద్ది నిమిషాలు ముందు రాసిన కీలక పేజీ ప్రస్తుతం సిబిఐ అధికారుల విచారణలో అత్యంత కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు రూపురేఖలను మార్చే ఆధారంగా పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అత్యాచారం అనంతరం ఆమె ఈ పేజీని రాసి ఉంటే మాత్రం అసలు దోషులు ఎవరు, ఈ ఘటనకు పాల్పడింది ఎందుకనే విషయాలను సిబిఐ అధికారులు వేగంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా డైరీలోని ఒక పేజీ ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.