జూనియర్ ఎన్టీఆర్ పాత ఇంటి స్థలంపై వివాదం.. హైకోర్టులో తారక్ పిటిషన్

ఓ స్థల వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం తలెత్తినట్టు తెలిసింది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొన్నారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఈ ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీతలక్ష్మి లోన్స్ పొందారు.

tarak ntr
జూనియర్ ఎన్టీఆర్

ఈవార్తలు, హైదరాబాద్: ఓ స్థల వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్  విషయంలో వివాదం తలెత్తినట్టు తెలిసింది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొన్నారు. అప్పటికే 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఈ ప్రాపర్టీ మోర్ట్ గెజ్ ద్వారా గీతలక్ష్మి లోన్స్ పొందారు. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి 3-4 బ్యాంకుల నుంచి లోన్ పొందినట్లు తెలిసింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్‌కు అమ్మే సమయంలో ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టారు. మొత్తంగా ఐదు బ్యాంకుల నుంచి గీతలక్ష్మి లోన్ పొందినట్లు తెలిసింది. కానీ, ఒక్క బ్యాంక్‌లోనే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఆమె ఎన్టీఆర్‌కు చెప్పింది. దాంతో చెన్నైలోని ఓ బ్యాంక్‌లో లోన్ క్లియర్ చేసిన తారక్ డాక్యుమెంట్లు తీసుకున్నారు. అప్పటినుంచి పలు బ్యాంక్ మేనేజర్లతో ఈ వివాదం కొనసాగుతోంది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నించడంతో వారిపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారంపై 2019లో పోలీసులు చార్జిషీట్ వేశారు. అయితే, తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా డీఆర్టీలో ఆర్డర్ వేశారు. దీంతో తారక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జూన్ 3 లోపు డీఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలని హైకోర్టు ఆదేశించి, జూన్ 6న విచారణ చేపడతామని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈ వివాదాస్పద స్థలాన్ని 2013లోనే ఎన్టీఆర్ అమ్మేశారని తారక్ టీమ్ వెల్లడించింది. ఈ కేసులో జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్