బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించారు. డజనుకు పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు. నేడు శ్రావణ సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు జలాభిషేకానికి తరలివచ్చారు. ఒక్కసారి భక్తులు తోసుకుంటూ రావడంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
Bihar:బీహార్‌లోని జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్‌లోని చారిత్రాత్మక వనవర్ కొండపై ఉన్న సిద్ధేశ్వర్ నాథ్ ఆలయ సముదాయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మరణించారు. డజన్ కు పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శ్రావణ సోమవారం కావడంతో జలాభిషేకానికి భక్తులు భారీగా తరలివచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జి చేయడంతో తొక్కిసలాట జరిగి భక్తులు అటు ఇటు పరుగులు తీశారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
గాయపడిన భక్తులను మఖ్దుంపూర్ రిఫరల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనతో గుడి, ఆస్పత్రి ఆవరణలో విషాదం నెలకొంది.మృతుల్లో సుశీలాదేవి, పూనమ్ దేవి, నిషా కుమారి, నిషా దేవి రాజు కుమార్‌లుగా గుర్తించారు. అందరూ మఖ్దుంపూర్ వాసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెహనాబాద్ పోస్ట్‌మార్టం హౌస్‌కు తరలించారు.దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారని సంఘటనా స్థలంలో ఉన్న ప్రజలు తెలిపారు. గుడిలోకి వెళ్లేందుకు గుంపులు గుంపులుగా జనం పరుగులు తీస్తుండగా, పోలీసులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రలాఠీచార్జి జరిగిన వెంటనే తొక్కిసలాట జరిగి ఈ పెను ఘటన చోటుచేసుకుంది.
ఇక్కడ కూడా భద్రతలో తీవ్ర లోపం వల్ల ఈ ఘటన జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఆది, సోమవారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, అయితే భద్రత పేరుతో ముగ్గురు పోలీసులు, ఎన్‌సీసీ బెటాలియన్ మాత్రమే ఉండడంతో రద్దీని నియంత్రించలేకపోయారని వాపోయారు. .