Jagtial News | జగిత్యాల జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

జగిత్యాల జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఫిబ్రవరి 1 నుంచి 29వ తేదీ వరకు) పాటు పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని పేర్కొన్నారు.

వెబ్ స్టోరీస్