Jagtial | బల్వంతాపూర్ ఎక్స్ రోడ్డు దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు చైన్, వెండి బ్రాస్‌లెట్, ఐఫోన్, రియల్ మీ ఫోన్, ఒక స్ప్లెండర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

mallial police

కేసు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

మల్యాల, ఈవార్తలు : జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్ గ్రామ పరిధిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి బంగారు చైన్, వెండి బ్రాస్‌లెట్, ఐఫోన్, రియల్ మీ ఫోన్, ఒక స్ప్లెండర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్ (ఏ1), మల్యాలకు చెందిన మల్యాల విష్ణువర్ధన్ (ఏ2) స్నేహితులు. వీరిద్దరు ఈ నెల 9న బల్వంతాపూర్ క్వారీలకు వెళ్లే దారిలో మద్యం సేవించారు. ఇంకా మద్యం తాగాలని భావించిన వారిద్దరు.. డబ్బు కోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో బాధితుడు బైక్‌ను ఆపి మూత్ర విసర్జన చేశాడు. అతడి మెడలో బంగారు గొలుసు, చేతికి వెండి బ్రాస్‌లెడ్ ఉండటాన్ని గమనించిన నిందితులు.. అతడిని కర్రలతో దాడి చేస్తామని బెదిరించి.. బంగారు చైన్, బ్రాస్‌లెట్, రూ.3,500 నగదు, మొబైల్ ఫోన్, బైక్ లాక్కొని పరారయ్యారు.

బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. మల్యాల సీఐ నీలం రవి ఆధ్వర్యంలో ఎస్సై నరేశ్ కుమార్ తన సిబ్బందితో నిందితులను పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డ వస్తువుల విలువ రూ.లక్షా 50 వేలు ఉంటుందని, నిందితుల నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. మరో దొంగతనానికి కూడా నిందితులు ప్లాన్ చేశారని, ఆలోగానే పట్టుకొన్నామని వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్