వైద్యురాలి హత్యాచార నిందితుడిని ఉరితీయాలన్న అత్త.. భార్యతోను విభేదాలు అంటూ వెల్లడి

కోల్ కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం చేసి వైద్య విద్యార్థిని హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. సిబిఐ అధికారులు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసు వెనక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పోలీసులు అరెస్టు చేసిన ఒక నిందితుడు సంజయ్ రాయ్ పట్ల కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ సర్వత్ర వినిపిస్తోంది.

Medical students protesting

నిరసన తెలియజేస్తున్న వైద్య విద్యార్థులు

కోల్ కతాలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజీలో అత్యాచారం చేసి వైద్య విద్యార్థిని హత్య చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. సిబిఐ అధికారులు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. ఈ కేసు వెనక పెద్ద తలకాయలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పోలీసులు అరెస్టు చేసిన ఒక నిందితుడు సంజయ్ రాయ్ పట్ల కఠినంగా వ్యవహరించాలన్న డిమాండ్ సర్వత్ర వినిపిస్తోంది. అదే సమయంలో మిగిలిన నిందితులను బయటకు తీసుకురావాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్టు అయిన సంజయ్ రాయ్ ను కుటుంబ సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఆయన అత్త దుర్గాదేవి ఈ వ్యవహారంపై తాజాగా స్పందించారు. సంజయ్ రాయ్, అతని భార్య మధ్య సత్సంబంధాలు లేవని స్వయంగా ఆమె వెల్లడించారు. కొంతకాలం క్రితం అతడు భార్యపై చేయి చేసుకోవడంతో ఆమెకు గర్భస్రావమైనట్లు వెల్లడించింది. సంజయ్ మంచివాడు కాదని అభిప్రాయపడ్డారు. అతడిని ఏం చేసినా పర్వాలేదని, ఉరి తీసిన సరేనని వ్యాఖ్యానించారు.

అతడు చేసిన నేరం గురించి మాత్రం తాను మాట్లాడలేనని దుర్గాదేవి స్పష్టం చేశారు. అంతటి నేరానికి పాల్పడే శక్తి అతనికి ఒక్కడికే లేదని మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఉండి ఉండచ్చని అభిప్రాయపడ్డారు. సంజయ్ తో తమకు సత్సంబంధాలు లేవన్న దుర్గాదేవి.. తన కూతురితో అతనికి పెళ్లి జరిగి రెండేళ్లు అవుతోందని వెల్లడించారు. తన కుమార్తె సంజయ్ కు రెండో భార్య అని, వివాహం అయినా తొలి ఆరు నెలలు అంతా సవ్యంగానే సాగిందన్నారు. గర్భం దాల్చినట్టు నిర్ధారణ కాగానే క్రమంగా గొడవలు ప్రారంభమైనట్లు వివరించారు. మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు తన కూతురిపై చేసుకున్నాడని, దీంతో ఆమెకు గర్భస్రావమైనట్లు వివరించారు. కేసు కూడా నమోదు చేసిన విషయాన్ని ఆమె వెల్లడించారు. అప్పటి నుంచి తన కూతురు అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తున్నానని సంజయ్ రాయ్ గురించి దుర్గాదేవి మీడియాకు వివరించారు. ఈ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. ఈ దారుణ సంఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివైస్ చంద్ర చూడ్ నేతృత్యంలోని ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు కేసును విచారించనుంది. ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆసుపత్రికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను పరిశీలించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని మమతా బెనర్జీ సర్కారు తీసుకుంది. ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అధిపతిగా ఐజి ప్రణవ్ కుమార్ ను నియమించింది. ఈ కేసుపై నెలలోగా పూర్తిస్థాయి విచారణ జరిపించి తొలి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్