Helicopter crash: నేపాల్‌లో హెలికాప్టర్ కూలి ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం

నేపాల్‌లోని నువాకోట్‌లో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. రాసువా వెళ్లే ఈ హెలికాప్టర్‌లో ఐదుగురు మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. ఇందులో నలుగురు చైనా పౌరులు ఉన్నట్లు సమాచారం.

Helicopter crash

ప్రతీకాత్మక చిత్రం 

వరుస హెలికాప్టర్ ప్రమాదాలు నేపాల్ ను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా నేపాల్‌లోని నువాకోట్‌లో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు చనిపోయారు. రాసువా వెళ్లే ఈ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయానికులు ఉన్నారని చెబుతున్నారు. ఇందులో నలుగురు చైనా పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల, జూలై 24 న, నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం కూలిపోయి 18 మంది మరణించారు. ఈ హెలికాప్టర్ కొద్ది రోజులకే కుప్పకూలింది. నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నేపాల్‌లో విమాన ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయని ఇది తెలియజేస్తోంది. ఘటనా స్థలంలో  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హెలికాప్టర్ నేపాల్‌లోని నువాకోట్‌లోని శివపురి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఇందులో ఎయిర్‌ డైనాస్టీ హెలికాప్టర్‌ కూలిపోయింది. విమానంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. హెలికాప్టర్ ఖాట్మండు నుండి బయలుదేరిందని.. సైఫ్రాబెన్సికి వెళ్తుండగా త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దగ్గర కూలిపోయినట్లు  హిమాలయన్ టైమ్స్‌కి తెలిపింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్