తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేటలో హిందూ వర్గానికి చెందిన ఫ్లెక్సీని కొందరు దుండగులు తగులబెట్టారు. జిల్లాలోని లింగంపేటలోని జంబి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని కొందరు.. హనుమాన్ చాలీసాతో కూడిన ఫ్లెక్సీని, కాషాయ రంగు జెండాలకు నిప్పు పెట్టి కాల్చారు.
కాలిపోయిన హనుమాన్ చాలీసా ఫ్లెక్సీ
కామారెడ్డి, ఈవార్తలు : తెలంగాణలోని కామారెడ్డి జిల్లా లింగంపేటలో హిందూ వర్గానికి చెందిన ఫ్లెక్సీని కొందరు దుండగులు తగులబెట్టారు. జిల్లాలోని లింగంపేటలోని జంబి హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని కొందరు.. హనుమాన్ చాలీసాతో కూడిన ఫ్లెక్సీని, కాషాయ రంగు జెండాలకు నిప్పు పెట్టి కాల్చారు. దీంతో జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హిందూ వర్గాలు తీవ్ర ఆందోళనకు సిద్ధం అయ్యారు. మరో వర్గానికి చెందిన వ్యక్తుల పనిగా అనుమానిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ, ధార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టారు. గతంలోనూ ఈ ఆలయంలో ఇదే తరహా సంఘటనలు జరిగాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.