గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై భీకర దాడి చేసి వేలాది మంది పౌరుల మరణానికి కారణమైన హమాస్ సంస్థ అధినేత ఇస్మాయిల్ హనియే ఇరాన్ లో హతమయ్యాడు. ఖతార్ నుండి హమాస్ రాజకీయ కార్యకలాపాలను రహస్యంగా నియంత్రించే హనీయే, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్ చేరుకున్నారు.అక్కడే హత్యకు గురయ్యాడు.
ismail haniyeh
హమాస్ కు బిగ్ షాక్ తగిలింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే దారుణ హత్యకు గురయ్యాడు. ఆయనతోపాటు ఆయన అంగరక్షకుల్లో ఒకరు కూడా మరణించారు. ఇస్మాయిల్ హనియే మరణించిన హమాస్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు హమాస్ హత్యకు ఇజ్రాయెల్ కారణమని ఆరోపిస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది.మంగళవారం ఉదయం టెహ్రాన్‌లోని ఇస్మాయిల్ హనియెహ్ నివాసంపై జియోనిస్ట్ ద్రోహపూరిత దాడి అతన్ని చంపింది" అని హమాస్ తెలిపింది. దాడికి సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.ఉద్యమ అధినేత, సోదరుడు, నాయకుడు, ముజాహిద్ ఇస్మాయిల్ హనియే, ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత టెహ్రాన్‌లోని వారి ప్రధాన కార్యాలయంలో జియోనిస్ట్ దాడిలో మరణించారు" అని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది.
అక్టోబరు 7న, ఇజ్రాయెల్ సరిహద్దులో క్రూరమైన దాడిలో 1,195 మందిని చంపడానికి కారణమైన హమాస్ సమూహాన్ని నాశనం చేస్తామని.. దాని నాయకుడు ఇస్మాయిల్ హనియెహ్‌ను హత్య చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.ఖతార్‌లో తలదాచుకుని హమాస్ రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇస్మాయిల్ హనియే మంగళవారం ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కూడా కలిశారు.ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కూడా ఇస్మాయిల్ హనియే హత్యను ధృవీకరించింది.
ఈ ఘటన అనంతరం ఇజ్రాయెల్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి డేనియల్ హగారి మాట్లాడుతూ, "మేము మా శత్రుత్వాన్ని తదుపరి యుద్ధం లేకుండా పరిష్కరించుకోవాలనుకుంటున్నాము అని వెల్లడించారు. లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా సీనియర్ కమాండర్ ఫవుద్ షుకర్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) తెలిపిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో 12 మంది పిల్లలను చంపిన రాకెట్ దాడికి ఫవుద్ షుకర్ కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది.