కోల్ కతాలో సామూహిక అత్యాచారానికి గురై హత్య గావించబడిన వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఒకవైపు దేశమంతా ఎలుగెత్తి నినదిస్తుంటే.. మరోవైపు ఈ తరహా దారుణాలు మాత్రం ఆగడం లేదు. నిన్న ఏలూరులో వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన విషయం వెలుగులోకి రాగా, తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఒక బాలికపై బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది.
అత్యాచారానికి గురైన యువతి
కోల్ కతాలో సామూహిక అత్యాచారానికి గురై హత్య గావించబడిన వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలంటూ ఒకవైపు దేశమంతా ఎలుగెత్తి నినదిస్తుంటే.. మరోవైపు ఈ తరహా దారుణాలు మాత్రం ఆగడం లేదు. నిన్న ఏలూరులో వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన విషయం వెలుగులోకి రాగా, తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఒక బాలికపై బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. డెహ్రాడూన్ లోని అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీ - డెహ్రాడూన్ బస్సులో టీనేజీ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను విశ్లేషించి దారుణం చోటు చేసుకున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ బస్ డ్రైవర్లు, కండక్టర్ ఉండడం గమనార్హం.
ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందింది. అనంతరం కమిటీ సభ్యులు బాలికను బాల నికేతన్ కు తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వగా బాలిక జరిగిన సంఘటనను వివరించింది. దీంతో శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్ రాష్ట్రమని, తాను ఒక అనాధనని బాధితురాలు చెప్పినట్లు వెల్లడించారు. అనంతరం తనది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ అని చెప్పిందన్నారు. బాలిక మురాదాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి డెహ్రాడూన్ కు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడయింది. బస్సు డెహ్రాడూన్ కు చేరుకున్న తర్వాత ప్రయాణికులు అంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు అజయ్ సింగ్ పేర్కొన్నారు. అనంతరం పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరూ, ఆ తర్వాత బస్టాండ్ లోని క్యాషియర్ కూడా ఆకృత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరచనున్నారు.