||ప్రతీకాత్మక చిత్రం||
ప్రేమ ఇద్దరి స్నేహితులను కూడా శత్రువుగా మార్చే శక్తి ఉందంటారు.. కానీ, నేటి సమాజంలో ప్రేమ కోసం ఎంతటి దారుణానికైనా వెనకాడటం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ లో ఘోర దారుణం నెలకొంది. ఓకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమించడం వల్ల హరికృష్ణ అనే వ్యక్తి నవీన్ ని చంపి మృతదేహాన్ని గుట్ట ప్రాంతంలో పడేసాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు.
వివరాల్లోకెళ్తే.. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నవీన్(20), హరికృష్ణ (20) బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించడం వల్ల ఆ అమ్మాయి ఎక్కడ తనకు దక్కకుండా పోతుందో అని హరికృష్ణ ప్లాన్ చేసి నవీన్ హత్య చేసి అబ్దుల్లాపూర్ మెట్ గుట్టల్లో పడేశాడు. అసలేం జరిగిందంటే.. హరికృష్ణ హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని తన స్నేహితుడి రూములో పార్టీ చేసుకుందాం అంటూ నవీన్ కి ఫోన్ చేసి ఫిబ్రవరి 17న పిలిచాడు. వీరు ఇద్దరు తాగడంతో మాట మాట పెరిగి గొడవ జరిగింది. ఈ గొడవను నవీన్ తన తండ్రికి ఫోన్ చేసి తెలిపాడు. దీంతో నవీన్ తండ్రి హరికృష్ణతో మాట్లాడి గొడవను ఆపారు. ఇలా జరిగిన నాలుగు రోజులైనా నవీన్ ఇంటికి, కళాశాలకు రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఫిబ్రవరి 22న నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై రామకృష్ణ కేసును దర్యాప్తు చేయగా నవీన్ స్నేహితులు హరికృష్ణ పై ఒత్తిడి తీసుకురాగా.. శుక్రవారం దర్యాప్తులో హరికృష్ణ, నవీన్ ను చంపానని లొంగిపోయాడు. అయితే హరికృష్ణతో పాటు నవీన్ ను చంపడానికి ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల కోసం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పోస్టుమార్టం కోసం తరలించారు.