శ్రీకాకులంలో దారుణం.. లారీ ఢీకొని నలుగురి మృతి

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

|| ప్రతీకాత్మక చిత్రం ||

లారీలు అదుపుతప్పి ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం మందడిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఉపాధి కూలీలను లారీ ఒక్కసారిగా అదుపుతప్పి వారిపై నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన 108 కి కాల్ చేసి శ్రీకాకుళం సర్వజన హాస్పిటల్లో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్