గుజరాత్ లోని రాజ్కోట్ లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. టీఆఆర్పి పేరుతో నిర్వహిస్తున్న ఓ మాల్ లోని గేమింగ్ జోన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు గేమింగ్ జోన్ లో 60 మంది దాకా ఉన్నారు. 20 మందిని అధికారులు రక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో 27 మంది మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు.
అగ్ని ప్రమాదంలో దగ్ధమవుతున్న గేమింగ్ జోన్
గుజరాత్ లోని రాజ్కోట్ లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. టీఆర్పి పేరుతో నిర్వహిస్తున్న ఓ మాల్ లోని గేమింగ్ జోన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు గేమింగ్ జోన్ లో 60 మంది దాకా ఉన్నారు. 20 మందిని అధికారులు రక్షించారు. ఈ అగ్ని ప్రమాదంలో 27 మంది మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. మిగిలినవారు లోపల ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చే సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ గేమింగ్ జోను పూర్తిగా కలపతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించి అక్కడున్న వారు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయిందని, ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ గేమింగ్ జోన్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు గుర్తించారు. దీని నిర్వహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాన మోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఎక్స్ లో ప్రధాన మోడీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు నాలుగు లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.