బాసరలో అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం.. తండ్రీ కూతురు గల్లంతు

అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బాసరలోని గోదావరి నది వద్ద చోటుచేసుకుంది.

basara godavari river

బాసర గోదావరి నది

బాసర, ఈవార్తలు : అప్పుల బాధలు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన బాసరలోని గోదావరి నది వద్ద చోటుచేసుకుంది. నిజామాబాద్‌లో వ్యాపారం చేసే ఉప్పలించి వేణు కుటుంబం.. అప్పులు ఎక్కువవడంతో మనస్తాపం చెందారు. అప్పు ఇచ్చినవాళ్లు తిరిగి ఇవ్వాలని అడగటంతో తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. బుధవారం బాసరలోని గోదావరి నది వద్దకు వచ్చి మొదటి ఘాట్ వద్ద గోదావరిలోకి దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే, ఈ ఘటనలో తండ్రి, కూతురు (పూర్ణిమ) గల్లంతయ్యారు. అక్కడ ఉన్న స్థానికులు తల్లి(అనురాధ)ని కాపాడారు. అప్పుల వాళ్ల వేధింపులు తట్టుకోలేకే తాము ఆత్మహత్యకు సిద్ధమయ్యామని అనురాధ పోలీసులకు వెల్లడిస్తూ బోరున విలపించింది. మనుషులను పంపి ఆడవాళ్లను వివస్త్రను చేస్తానని వ్యాపారులు రోషన్, వికాస్ బెదిరించారని తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్