ఢిల్లీ మద్యం స్కాం గురించి కేసీఆర్‌కు ముందే తెలుసా?

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలు వెల్లడించింది. ఢిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy) గురించి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ముందే తెలుసు అని తెలిపింది.

delhi liquor scam

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ వాదనల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలు వెల్లడించిందని వార్తలు వెలువడ్డాయి. ‘ఢిల్లీ మద్యం విధానం (Delhi Liquor Policy) గురించి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ముందే తెలుసు ఈ మేరకు హైకోర్టుకు పలు విషయాలు వివరించింది. ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ కుంభకోణం గురించి ముందుగానే ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్‌కు చెప్పారు అని తెలిపింది. ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసంలో తన టీం సభ్యులు బుచ్చి బాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైని కవిత కేసీఆర్‌కు పరిచయం చేశారని ఈడీ వెల్లడించింది. కవిత పరిచయం చేసినవారి నుంచి కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారని, కేసీఆర్‌కు సమీర్ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేసినట్లు స్పష్టం చేసింది. కేసీఆర్‌తో భేటీ అయిన వివరాలను గోపీ కుమారన్ తన వాంగ్మూలంలో రికార్డు చేశారని తెలిపింది. ఇక.. కవిత రెండేళ్లలో 11 సెల్‌ఫోన్లు వాడారని, అందులోని నాలుగు ఫోన్ల డేటాను ధ్వంసం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు’ ’ అంటూ వార్తలు వచ్చాయి. కానీ అదంతా అబద్ధం అని కవిత తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్