జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. బైక్ డిక్కీలోనే 2 లక్షల ధాన్యం డబ్బులు

జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఓ ఘటన రైతుకు కన్నీరు మిగిల్చింది. ఎలక్ట్రిక్‌ బైక్‌కు చార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే పేలింది.

jagtial crime

మంటల్లో ఎలక్ట్రిక్ బైక్

జగిత్యాల, ఈవార్తలు : జగిత్యాల జిల్లా బాలపెల్లి గ్రామంలో ఓ ఘటన రైతుకు కన్నీరు మిగుల్చింది. ఎలక్ట్రిక్‌ బైక్‌కు చార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే పేలింది. ఆ సమయంలో బైక్ డిక్కీలో వరి ధాన్యం డబ్బులు సుమారు రూ.1.90 లక్షలు ఉన్నట్లు బాధితుడు బేతి తిరుపతి రెడ్డి తెలిపాడు. బైక్ కొని 40 రోజులైనా కాకముందే బైక్ పేలడం.. అందులోని డబ్బంతా బుగ్గిపాలు కావడంపై కుటుంబం లబోదిబోమంటోంది. ప్రస్తుతం వరికోతలు అయ్యి ధాన్యం అంతా కొనుగోలు కేంద్రాలకు చేరుతున్నాయి. గతంలోనే ధాన్యాన్ని అమ్మిన రైతు.. ఆ డబ్బు రావడంతో బ్యాంకు నుంచి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద బైక్ పార్కు చేసి చార్జింగ్ పెట్టగా.. కాసేపటికే భారీ శబ్దంతో పేలుడు సంభవించి, మంటలు అంటుకున్నాయి. దీంతో బైక్ మొత్తం మంటల్లో కాలిపోయింది. బైక్ డిక్కీలో ఉన్న రూ.1.90 లక్షలు కూడా కాలిపోయాయి. దీంతో ఆ రైతన్న ఆవేదన అంతా ఇంతా కాదు. ఆరుగాలం కష్టపడి సంపాదించిన డబ్బంతా మసి అయిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా కన్నీరుమున్నీరయ్యారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్