సెలబ్రిటీల రూ.8 కోట్ల ఆస్తులు జప్తు

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ భారీ చర్యలు చేపట్టింది. పలువురు సెలబ్రిటీల రూ.7.93 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.

celebrities in betting app case

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ భారీ చర్యలు చేపట్టింది. పలువురు సెలబ్రిటీల రూ.7.93 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఆస్తులు అటాచ్ అయిన వారిలో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, ఉర్వశి రౌతేలా, సోనూ సూద్, మిమీ చక్రవర్తి, అంకుష్ హజ్రా, నేహా శర్మ ఉన్నారు. యువరాజ్ సింగ్ - 2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప - 8.26 లక్షలు, ఉర్వశి రౌతేలా - 2.02 కోట్లు (ఈ ఆస్తి ఆమె తల్లి పేరు మీద ఉంది),సోనూ సూద్ - 1 కోటి, మిమీ చక్రవర్తి - 59 లక్షలు, అంకుష్ హజ్రా - 47.20 లక్షలు, నేహా శర్మ - 1.26 కోట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఇదే కేసులో ఈడీ శిఖర్ ధావన్ రూ.4.55 కోట్లు, సురేశ్ రైనా రూ.6.64 కోట్లను అటాచ్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు వన్ ఎక్స్ బెట్ కేసులో ఈడీ రూ.19.07 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.


క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్