Earthquake | 21 వేలకు చేరిన టర్కీ సిరియా మృతుల సంఖ్య

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||21 వేలకు చేరిన టర్కీ సిరియా మృతుల సంఖ్య.. కొనసాగుతున్న సహాయక చర్యలు||

ఈవార్తలు, న్యూఢిల్లీ : టర్కీ, సిరియాల్లో మృతుల సంఖ్య 21 వేలకు చేరింది. భారీ భూకంపం దాటికి ఇప్పటికే వేల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని టర్కీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంపం సంభవించి ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయినందున శిథిలాల కింద చిక్కుకున్నవారు బతకటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు భూకంపం, మరోవైపు గడ్డ కట్టే చలి సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. సిరియాలో అంతర్యుద్ధం వల్ల కూడా అక్కడ సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూకంపం వల్ల రోడ్లు ధ్వంసం కావడం, రన్‌వేలు పాడవడం వల్ల వేగంగా సహాయం అందడం లేదు.

అటు.. భవన శిథిలాలను తొలగించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు దేశాలకు సహాయం చేయడానికి దాదాపు 1.10 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దాదాపు 6 వేల వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు కూడా సహాయక చర్యల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇదిలా ఉండగా, భూకంపంతో భారీ నష్టాన్ని చవిచూసిన టర్కీ, సిరియాకు అమెరికా, వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. అమెరికా రూ.700 కోట్లు, ప్రపంచ బ్యాంక్ రూ.1.46 లక్షల కోట్ల సాయాన్ని అందిస్తామని వెల్లడించాయి.

మరోవైపు, భూకంపం ధాటికి టర్కీ దేశం పక్కకు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపానికి టర్కీ దేశం కదిలిందని వెల్లడించారు. సిరియాతో పోల్చితే టర్కీ 5-6 మీటర్ల మేర ఒకవైపునకు కదిలిపోయిందని వివరించారు. టర్కీ భూమి పైపొరల్లోని టెక్టోనిక్ ప్లేట్ల వల్ల భూకంపం సంభవించిందని, దాంతో టర్కీ దేశం పక్కకు కదిలిందని పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్