జైపూర్ నుంచి 3 వేల కిలోల కుక్క మాంసం.. అది మటన్ అంటున్న యజమాని

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కుక్క మాంసం దొరకటం సంచలనం రేపింది. సిటీలోని సిటీ రైల్వేస్టేషన్‌లో ఏకంగా 3 వేల కిలోల కుక్క మాంసం దొరికింది.

dog meat bengaluru

ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో కుక్క మాంసం దొరకటం సంచలనం రేపింది. సిటీలోని సిటీ రైల్వేస్టేషన్‌లో ఏకంగా 3 వేల కిలోల కుక్క మాంసం దొరికింది. రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి బెంగళూరుకు కుక్క మాంసాన్ని పార్కిల్ చేసినట్లు తెలిసింది. మటన్ పేరుతో దీన్ని తీసుకొస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దాదాపు 150 కార్టన్ బాక్సుల్లో వీటిని తెప్పించారు. దీంతో రంగంలోకి దిగిన బెంగళూరు నగర పాలక సంస్థ అధికారులు, పోలీసులు.. ఆ మాంసాన్ని సీజ్ చేసి, పరీక్షల కోసం పంపించారు. 

అయితే, ఈ మాంసం కుక్క మాంసం కాదని, మటన్ అని యజమాని అబ్దుల్ రజాక్ వాదిస్తున్నారు. తాను ఈ పార్సిళ్లను చట్టబద్ధంగానే ఇక్కడికి తెప్పించానని, కుట్రతో తనపై ఆరోపణలు చేస్తున్నారని యజమాని ఆరోపించాడు. ‘మటన్ అని చెప్పడానికి డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. మాంసంలో ఉన్న తోక గొర్రెది.. కుక్కది కాదు’ అని తెలిపాడు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్