వందల కోట్ల బంగారు ఆభరణాల కంటెయినర్ బోల్తా.. ఎక్కడ.. ఏం జరిగిందంటే..

తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి సేలంకు బయల్దేరింది. సరిగ్గా ఈరోడ్ సమీపంలోని ఈరోడ్‌కు వచ్చేసరికి ఒక్కసారిగా బోల్తా పడింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

gold erode
ప్రతీకాత్మక చిత్రం Photo: Facebook

ఈవార్తలు, నేషనల్ న్యూస్: ఆ కంటెయినర్ నిండా వందల కోట్ల ఆభరణాలు.. తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి సేలంకు బయల్దేరింది. సరిగ్గా ఈరోడ్ సమీపంలోని ఈరోడ్‌కు వచ్చేసరికి ఒక్కసారిగా బోల్తా పడింది. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కంటెయినర్‌లో ఉన్న బంగారు ఆభరణాలు ఏకంగా 810 కిలోలు.. దాని విలువ అక్షరాలా రూ.666 కోట్లు. వివరాల్లోకెళితే.. ఓ ప్రైవేట్ లాజిస్టిక్ సంస్థకు చెందిన కంటెయినర్ బంగారు ఆభరణాలను లోడ్ చేసుకొని కోయంబత్తూర్ నుంచి సేలంకు బయల్దేరింది. సమతువపురం వద్దకు రాగానే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కంటెయినర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న చిటోడే పోలీసులు.. వారిద్దరిని ఆస్పత్రికి తరలించారు. కంటెయినర్ లోపల ఉన్న బంగారు ఆభరణాలు సురక్షితంగానే ఉన్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై యజమానులకు సమాచారం ఇవ్వటంతో వారు హుటాహుటిన కొత్త కంటెయినర్‌ను పంపి ఆభరణాలను లోడ్ చేసి సేలంకు తరలించారు. అయితే, ఘటపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

వెబ్ స్టోరీస్