చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్యహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని అల్వాల్-పంచశీల కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు.
ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం ఫ్యామిలీ
అల్వాల్, ఈవార్తలు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్యహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని అల్వాల్-పంచశీల కాలనీలోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉండటంతో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు తెలిసింది. ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. గురువారం ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం నియోజకవర్గంలోనే ఉన్నారు. మల్యాల మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మేడిపెల్లి సత్యం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. సత్యం-రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు.