అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్ లో వైసిపి నాయకుడు పొంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. సుమారు 20 మంది వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చారు.
హత్య జరిగిన ఇంటి వద్ద విచారణ చేస్తున్న పోలీసులు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్ లో వైసిపి నాయకుడు పొంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురయ్యారు. సుమారు 20 మంది వ్యక్తులు కత్తులు, కొడవళ్లతో పొడిచి అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీవారి నగర్ ప్రాంతానికి చెందిన పుంగనూరు శేషాద్రి(25) ఇంట్లో ఉండగా 20 మంది వ్యక్తులు కత్తులతో వచ్చారు. శేషాద్రి ఇంటి తలుపులు పగలగొట్టి, అద్దాలు ధ్వంసం చేసి మరి విచక్షణారహితంగా దాడి చేశారు. శరీరంపై కత్తులతో విరుచుకుపడడంతో శేషాద్రి రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్ప కూలిపోయారు. స్థానికులు సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ సాగిస్తున్నారు. హత్య చేసిన అనంతరం దుండగుల్లో కొందరు పరారీ కాగా, నలుగురు పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ హత్య ఇది వర్గాల మధ్య ఆధిపతులు ఊరిలో భాగంగా జరిగినట్లు ఈ హత్య ఇది వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన ఆనంద్, శేషు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరూ వైసీపీకి చెందిన నాయకులు కాగా, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సమయంలో తలెత్తిన వివాదం కారణంగా వీరి మధ్య గొడవ ప్రారంభమైంది. భూ ఆక్రమణలు, కబ్జాల్లో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కొన్నాళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే శేషాద్రి హత్యకు ప్రత్యర్థి వర్గం పాల్పడింది. గుంపుగా వచ్చి అత్యంత పాసవికంగా శేషాద్రిపై ప్రత్యేక వర్గం దాడికి పాల్పడి హత్య చేసింది.
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
శేషాద్రి హత్య సమయంలో అతని భార్య ఇంట్లోనే ఉంది. భార్య చూస్తుండగానే హత్య చేసినట్లు చెబుతున్నారు. హత్యకు పాల్పడిన వారిలో పది మందికి పైగా ఉన్నట్లు పోలీసులకు శేషాద్రి భార్య వెల్లడించింది. నలుగురు వ్యక్తులు పోలీసులు ఎదుట లొంగిపోగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మదనపల్లి డిఎస్పి ప్రసాదరెడ్డి, సిఐలు వల్లి భాష, యువరాజు, శేఖర్ విచారణ సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు మదనపల్లి డిఎస్పి ప్రసాద్ రెడ్డి తెలిపారు.