Formula-E car Race కేసులో ట్విస్ట్.. బీఆర్ఎస్‌కు భారీగా ఎలక్టోరల్ బాండ్లు

ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఫార్ములా-ఈ కారు రేస్‌లో భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో నుంచి బీఆర్‌ఎస్‌కు భారీగా ఎలక్టోరల్ బాండ్లు వెళ్లినట్లు పేర్కొంది.

formula e car race

ప్రతీకాాత్మక చిత్రం

హైదరాబాద్, ఈవార్తలు: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఫార్ములా-ఈ కారు రేస్‌లో భాగస్వామిగా ఉన్న గ్రీన్ కో నుంచి బీఆర్‌ఎస్‌కు భారీగా ఎలక్టోరల్ బాండ్లు వెళ్లినట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ కోసం భారీగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా 41 సార్లు.. ప్రతి సారి రూ.కోటి విలువ చేసే బాండ్లు వెళ్లినట్లు వివరించింది. మొత్తం మీద రూ.41 కోట్ల మేర బీఆర్ఎస్‌కు ఎన్నికల బాండ్ల రూపంలో చెల్లింపులు జరిగాయని పేర్కొంది. మరోవైపు.. ఇదే కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్లగా.. ఆయన న్యాయవాదిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన విచారణకు హాజరు కాకుండానే తిరిగి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు. వెళ్లిపోతూ.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. కాసేపట్లో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్