Beazil plane crash: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం..విమానం కూలిన 62 మంది దుర్మరణం

బ్రెజిల్‌లోని సావో పాలో ప్రాంతంలోని విన్హెడోలో ప్రయాణీకుల విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 62 మంది చనిపోయారు.

Brazil plane crash

ప్రతీకాత్మక చిత్రం 

బ్రెజిల్‌లోని సావో పాలో ప్రాంతంలోని విన్హెడోలో ప్రయాణీకుల విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విన్‌హెడో నగరంలో విమానం కూలిపోయిందని, విమానం ముందు భాగం నుంచి పొగలు వస్తున్నాయని స్థానిక అగ్నిమాపక సిబ్బంది నిర్ధారించారు. సావో పాలోలోని గౌరుల్‌హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం కూలిపోయిందని ఎయిర్‌లైన్ VoePass ఒక ప్రకటనలో ధృవీకరించింది. విమానంలో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి కారణమేమిటో ప్రకటనలో వెల్లడించలేదు.విమాన ప్రమాదంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా విచారం వ్యక్తం చేశారు. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్