రక్తమోడుతున్న రహదారులు.. రోజుకు సగటున 474 మంది దుర్మరణం

దేశంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మృతి చెందుతున్నారు. మరింత మంది ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా గడిచిన ఏడాది 1.7 లక్షల మందికిపైగా వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరాలు వెల్లడించాయి. కేంద్రానికి ఆయా రాష్ట్రాల సమర్పించిన నివేదిక ప్రకారం చూస్తే దేశంలో సగటున రోజుకు 474 మంది మృతి చెందుతున్నట్లు తేలింది.

Cars crushed in an accident

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కార్లు

దేశంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది మృతి చెందుతున్నారు. మరింత మంది ప్రమాదాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా గడిచిన ఏడాది 1.7 లక్షల మందికిపైగా వాహనదారులు, ప్రయాణికులు ప్రాణాలను కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వివరాలు వెల్లడించాయి. కేంద్రానికి ఆయా రాష్ట్రాల సమర్పించిన నివేదిక ప్రకారం చూస్తే దేశంలో సగటున రోజుకు 474 మంది మృతి చెందుతున్నట్లు తేలింది. అంటే ప్రతి మూడు నిమిషాలకు దాదాపు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారు. ప్రమాదాల వెనుక కారణాలు, సమస్యలను మదింపు చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్రం రోడ్డు ప్రమాదాల గణాంకాలను క్రోడీకరించడం మొదలు పెట్టినప్పటి నుంచి గత ఏడాదిలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా గాయాల పాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఏడాదిలో దాదాపు 4.63 లక్షల మంది గాయాలు పాలయ్యారు.

2022 ఏడాదితో పోల్చితే ఇది నాలుగు శాతం కన్నా అధికంగా ఉంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గత ఏడాదిలో రోడ్డు ప్రమాదాల మూలంగా జరిగిన మరణాలు 1.6 లక్షల పైగానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో అధిక శాతం మంది యువత ఉండడం ఆందోళన కలిగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ప్రమాదాల బారిన పడుతున్న వారిలో దాదాపు 30 నుంచి 40 శాతం మంది యువత ఉంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరి ట్రామా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిలో యువకులు ఉంటున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదాల్లో గాయపడుతున్న యువతలో ఎక్కువమంది తల గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాద బాధితుల్లో ఎక్కువమంది మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, నిద్రమత్తులో ప్రమాదాలు బారిన పడడం వంటి అంశాలు కారణాలుగా ఉంటున్నాయని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్రాలతో కలిసి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్