తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ఆలయాలపై దాడులు.. అన్నమయ్య జిల్లాలోనూ ఆంజనేయస్వామి గుడి కూల్చివేత

ఆంధ్రప్రదేశ్‌లోని ములకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వెలుగుచూసిన ఘటనపై ఆరెస్సెస్, బీజేపీ, వీహెచ్‌పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

annamaiah district

అన్నమయ్య జిల్లాలో ఘటన

తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల ధ్వంసం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంపై దాడి ఘటన జరగ్గా.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లిలో పెద్దమ్మ తల్లి ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన దేవతావిగ్రహాలను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని ములకలచెరువు వద్ద అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం అర్ధరాత్రి వెలుగుచూసిన ఘటనపై ఆరెస్సెస్, బీజేపీ, వీహెచ్‌పీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన నిందితుల్లో ఒకడు సల్మాన్ సలీం ఠాకూర్‌.. విద్వేష ప్రసంగాలు వినడం.. ఇతర మతాల పట్ల విద్రోహ మనస్తత్వాన్ని ప్రదర్శించడం లాంటివి చేసేవాడని తేలింది. మహారాష్ట్రలోని ముంబ్రాకు చెందిన సల్మాన్.. బీటెక్ చేశాడు. జకీర్ నాయక్ ప్రసంగాలు వింటూ ఇతర మతాలపై ద్వేషం పెంచుకున్నాడు. గత నెల హైదరాబాద్‌కు వచ్చిన సల్మాన్.. ముంబైలోనూ పలు విగ్రహాల ధ్వంసానికి పాల్పడట్లు పోలీసుల విచారణలో తేలింది.

సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్