హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉన్న ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని హాస్పిటల్‌లో చేరిన 5 ఏళ్ల చిన్నారి అన్విక ప్రాణాలు తీశారు డాక్టర్లు.
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఉన్న ఆనంద్ ఐ ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని హాస్పిటల్‌లో చేరిన 5 ఏళ్ల చిన్నారి అన్విక ప్రాణాలు తీశారు డాక్టర్లు. అన్విక కంటికి సర్జరీ చేయాలని చెప్పిన డాక్టర్స్. సర్జరీ చేసేముందు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప మృతి చెందింది. ఇంజక్షన్ హెవీ డోస్ కారణంగా పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. కంటిలో నలుసు పడిందని హాస్పిటల్‌కు తీసుకొస్తే.. ప్రాణమే పోయిందని రోదిస్తున్నారు. హాస్పిటల్ వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.