Kandukur | కందుకూరు టీడీపీ సభలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి (Video)

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

(Pic: కందుకూరు సభలో తొక్కిసలాట)

ఈవార్తలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కందుకూరులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటుచేసుకొని 8 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కందుకూరులో సభ నిర్వహించారు. సభకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువ మంది రావటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన కార్యకర్తలను చంద్రబాబు మైక్ ద్వారా పదే పదే హెచ్చరించారు. ఇంతలోనే తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారు.

సభను మధ్యలోనే ఆపేసిన చంద్రబాబు.. క్షతగాత్రులను పరామర్శించేందుకు స్థానిక దవాఖానకు వెళ్లారు. అనంతరం మాట్లాడుతూ.. మృతిచెందిన వారు త్యాగం చేశారని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబాలకు తాను అండగా ఉంటానని, రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని ప్రకటించారు. బాధిత కుటుంబాల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తానని హామీ ఇచ్చారు. 

మృతులు వీళ్లే..

ఈదుమూరి రాజేశ్వరి (40)  - కందుకూరు

యాకసిరి విజయ (45) - ఉలవపాడు మండలం వరిగచేనుసంగం

కాకుమాని రాజా(48) - కందుకూరు

కలవకూరి యానాది (55) - , కందుకూరు మండలం కొండముడుసుపాలెం

గడ్డం మధుబాబు (44) - ఓగూరు

దేవినేని రవీంద్ర (73) - ఆత్మకూరు

పురుషోత్తం (70) - , గుడ్లూరు మండలం గుళ్లపాలెం

చిన్నకొండయ్య (52) - అమ్మవారిపాలెం


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్