ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పాడు పనికి పాల్పడింది. బంగారం అక్రమ రవాణా చేస్తూ అధికారులకు చిక్కింది. తన రహస్య అంగాల్లో కిలో బంగారాన్ని దాచి, అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు.
ప్రతీకాత్మక చిత్రం
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి పాడు పనికి పాల్పడింది. బంగారం అక్రమ రవాణా చేస్తూ అధికారులకు చిక్కింది. తన రహస్య అంగాల్లో కిలో బంగారాన్ని దాచి, అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కేరళలో మూడు రోజుల క్రితమే జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 28న మస్కట్ నుంచి కన్నూర్ విమానాశ్రయానికి చేరిన విమానంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం వచ్చింది. విమాన సిబ్బందిలో సురభి ఖాతూన్ అనే ఎయిర్ హోస్టెస్ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం రావటంతో ఆమెను తనిఖీ చేయగా మల ద్వారంలో 960 గ్రాముల బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకొని, ఆమెను కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు నిందితురాలికి 14 రోజుల కస్టడీ విధించింది. దీంతో ఆమెను కన్నూరు మహిళా జైలుకు తరలించారు. దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌లైన్స్ సిబ్బంది రహస్య భాగాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేయటం దేశంలో తొలిసారి అని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, కేరళలో బంగారం స్మగ్లింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యే కేరళకే చెందిన కాంగ్రెస్ నేత శశిథరూర్ పీఏ వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడిని ఢిల్లీలో అరెస్టు చేశారు.