ఢిల్లీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆహుతైన 9 మంది చిన్నారులు

ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. వీరిలో ఏడుగురు నవజాత శిశువులు ఉన్నారు. ఢిల్లీలోని వివేక్ విహార ప్రాంతంలో బేబీ కేర్ న్యూ బోర్న్ అనే ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో చెలరేగిన అగ్నికీలలు లో ఏడుగురు నవజాత శిశువులు మరణానికి కారణమయ్యాయి.

ఆసుపత్రిలో చెలరేగుతున్న మంటలు

ఆసుపత్రిలో చెలరేగుతున్న మంటలు


ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మంటలకు ఆహుతయ్యారు. వీరిలో ఏడుగురు నవజాత శిశువులు ఉన్నారు. ఢిల్లీలోని వివేక్ విహార ప్రాంతంలో బేబీ కేర్ న్యూ బోర్న్ అనే ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో చెలరేగిన అగ్నికీలలు లో ఏడుగురు నవజాత శిశువులు మరణానికి కారణమయ్యాయి. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు చిన్నారులను వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరి కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. ఆసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్లు పేలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆసుపత్రి పక్కనున్న భవనాలకు మంటలు విస్తరించడంతో సమస్య తీవ్రత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన ఆసుపత్రి యజమాని నవీన్ కిచి పరారయ్యారు పోలీసులు ఆయన ఇంటికి చేరుకోక మునుపే రాజస్థాన్ కు పారిపోయినట్లు తెలిసింది. అయితే, ఆయన జైపూర్ లో ఉన్నట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఆఖరికి పంపి అదుపులోకి తీసుకున్నారు. నవీన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ హాస్పిటల్ కి సంబంధించి 2021 లో కూడా నవీన్ పై నేరపూరిత నిర్లక్ష్యం కేసు నమోదయింది. ఈ ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్ హోమ్ యాక్ట్ కింద రిజిస్టర్ కాలేదని, నాటి దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు జరిమానా విధించగా ఆ జరిమానా చెల్లించి ఆసుపత్రిని యథావిధిగా నడుపుతున్నారు. ఈ ఆసుపత్రి లైసెన్స్ మార్చి 31వ తేదీనే ఎక్స్పైర్ అయిపోయినట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేకుండానే ఆసుపత్రి నడిపిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ఆసుపత్రిలోని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు తగిన అర్హతలు లేకుండానే పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ చదివిన వారు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించడం గమనార్హం. దీనిపైన పోలీసులు దృష్టి సారించి విచారణ సాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్