దేశంలో అత్యాచార ఘటనలు వరుసుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట అమ్మాయిలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారు. కోల్ కతాలోని ఆర్జి కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థులపై సామూహిక అత్యాచారం చేసిన వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరుగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ సర్వత్ర వినిపిస్తోంది.
అత్యాచార ఘటన
దేశంలో అత్యాచార ఘటనలు వరుసుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట అమ్మాయిలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారు. కోల్ కతాలోని ఆర్జి కార్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ విద్యార్థులపై సామూహిక అత్యాచారం చేసిన వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సిబిఐ విచారణ జరుగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ సర్వత్ర వినిపిస్తోంది. అయినప్పటికీ ఈ తరహా ఘటనలు మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఈ తరహా సామూహిక అత్యాచారాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫేక్ ఎన్సిసి శిబిరంలో విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే శిబిరంలో మరో పదహారు మంది బాలికలను లైంగికంగా వేధించారు. ఈ ఘటనలో ఎన్సిసి కోచ్, పాఠశాల ప్రిన్సిపాల్ తోపాటు మొత్తం 11 మందిని ఫోక్సో చట్టం కింద పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా బర్గూరులో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బర్గూరులోని ఒక పాఠశాల ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు ఎన్సీసీ శిబిరం నిర్వహించారు. ఇందులో మొత్తం 41 మంది విద్యార్థులు పాల్గొనగా, వారిలో 17 మంది విద్యార్థినులు ఉన్నారు.
వీరికి పాఠశాల ప్రాంగణంలోనే వసతి కల్పించారు. ఈ నేపథ్యంలోనే కావేరి పట్టణానికి చెందిన కోచ్ శివరామన్ (30) తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ శిబిరంలో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేసింది. శిబిరంలో పాల్గొన్న బాలికలందరిపైనా నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. అయినా ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలోనే బాధ్యత విద్యార్థిని ఈ నేల 16న అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు ఆమెను కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు ధృవీకరించారు. విద్యార్థిని ఫిర్యాదుతో బర్గూరు పోలీసులు విచారణ జరిపి కోచ్ శివ రామన్, ప్రిన్సిపాల్ సతీష్ కుమార్ సహా మొత్తం 11 మందిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. కోచ్ శివరామన్ తమిళర్ పార్టీకి చెందిన నేతగా విచారణలో తేలింది. కాగా, ఎన్సిసి శిబిరంలో అత్యాచారం జరిగిందంటూ వార్తలు వెలువడటంతో రక్షణ శాఖ స్పందించింది. తాము ఎలాంటి ఎన్సిసి శిబిరం నిర్వహించలేదని పేర్కొంది. ఒకవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులే ఈ తరహా దారుణాలకు పాల్పడుతుండడం పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తమౌతోంది. కోచ్ హోదాలో ఉన్న వ్యక్తి చిన్నారులపై ఈ తరహా లైంగిక దాడికి పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. కఠిన చట్టాలను తీసుకువస్తేనే తప్ప ఈ తరహా దారుణాలకు అడ్డుకట్ట వేయలేమని పలువురు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేయాలని పలువురు నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.